Pawan Kalyan: ‘జయమ్మ పంచాయితీ’ టీమ్‌కు పవన్ కల్యాణ్ విషెస్..సుమతో కలిసి నటించాలని ఉందన్న పవర్ స్టార్

-

యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. ఈ సినిమా ట్రైలర్ శనివారం విడుదలైంది. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఉత్తరాంధ్ర యాసలోని పదాలను పిక్చర్ లో వాడినట్లు ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. వచ్చే నెల 6న సినిమా విడుదల కానుంది. ఇక ఈ మూవీ యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పేందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారిని కలిశారు.

ఈ సందర్భంగా పవర్ స్టార్ మాట్లాడుతూ ఇన్నాళ్ల పాటు యాంకరింగ్ చేసిన సుమ వెండితెరపైన కనబడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆమె సినిమా చేస్తోందని, అందరిలాగే తాను సుమ అభిమానినని, ఆమెను వెండితెర పైకి తీసుకొచ్చినందుకు దర్శకులు విజయ్ కుమార్ ను అభినందించారు పవన్ కల్యాణ్. ఉత్తరాంధ్ర కళలకు పుట్టినిల్లని, ఆ యాసలో సినిమా తెరకెక్కించడం అభినందనీయమని ప్రశంసించారు జనసేనాని.

ఈ క్రమంలోనే సుమ ప్రధాన పాత్రధారినా? లేక హీరోయినా? అని అడుగుతూ పవన్ యాంకర్ సుమపై పంచులు వేశారు. అనంతరం..ఈ ఒక్క సినిమాకే పరిమితం కాకుండా మరిన్ని చిత్రాలు చేయాలని సూచించారు. తనతో కూడా కలిసి నటించాలని, అవసరమైతే తాను నిర్మాతలతో మాట్లాడతానని పవన్ కల్యాణ్ చెప్పారు. ఎటువంటి పాత్రలు కావాలో చెప్తే ఆ పాత్రల కోసం మాట్లాడతానని అన్నారు. దాంతో వెంటనే సుమ మైక్ లో ఓకే చెప్పేసింది.

‘జయమ్మ పంచాయితీ’ మూవీ డైరెక్టర్, నటీ నటులు, ప్రొడ్యూసర్స్ కు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. సినిమా చక్కటి విజయం సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పవన్ కల్యాణ్-సుమలు కలిసి నటించే సీన్‌ను వెండితెరపైన చూసే అవకాశాలు అయితే ఉంటాయని స్పష్టమవుతోంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version