ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల ఆనారోగ్య సమస్యలతో పాటు ఒత్తిడి వంటి మానసిక సమస్యలు కూడా ఎంతో సాధారణంగా మారిపోయాయి. అయితే ఒత్తిడిని తగ్గించుకోకపోతే మానసిక ఆరోగ్యం పై ప్రభావం ఉంటుంది అని అందరికీ తెలిసిందే. కాకపోతే ఒత్తిడి వలన శారీరక ఆరోగ్యం కూడా మరింత దెబ్బతింటుంది. కొన్ని సందర్భాలలో ఒత్తిడి వలన మరింత ప్రభావం ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒత్తిడిని ఎదుర్కొంటారో దాని ప్రభావం మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు లేక సహా ఉద్యోగులతో మీకున్న సంబంధ బాంధవ్యాల పై కూడా ప్రభావం పడుతుంది.
అందువలన ఒత్తిడి నుండి బయటపడాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారం. తేలికపాటి వ్యాయామాలతో పాటుగా మంచి నిద్ర కూడా ఎంతో అవసరం. ఎందుకంటే శారీరక, మానసిక ప్రశాంతతను పొందాలంటే వీటిని పాటించడం ఎంతో అవసరం. సంగీతాన్ని వినడం వలన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మరియు ఒక అధ్యయనంలో తెలిసిన విషయం ఏమిటి అంటే సంగీతం అనేది ఒక చికిత్స లాగా పని చేస్తుంది. కనుక ఒత్తిడికి గురైనప్పుడు సంగీతాన్ని వినడం ఎంతో మేలు. ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు ఒక గ్లాసు నీటిని తీసుకుని ఆగకుండా తాగడం వలన వెంటనే అలసటతో పాటుగా ఒత్తిడి కుడా ఏంటో త్వరగా తగ్గిపోతుంది.
అంతేకాకుండా నడవడం వలన కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ప్రతి గంటకు లేదా రోజుకు నాలుగు, ఐదు సార్లు ఐదు నిమిషాలు పాటు నడవడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈ మధ్యకాలంలో సువాసన కోసం కొవ్వతులను చాలామంది ఉపయోగిస్తున్నారు. అయితే లావెండర్, యూకలిప్టస్, చమొమిలే వంటి సువాసనలను ఉపయోగించి తయారు చేసిన కొవ్వొత్తులను వెలిగించి దాని వాసనను పీల్చడం వలన ఒత్తిడి వెంటనే తగ్గిపోతుంది. కనుక ఇటువంటి మార్పులను మీ జీవితంలో చేయడం వలన ఎంతో ప్రశాంతకరమైన జీవితాన్ని పొందవచ్చు.