టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ ఇటీవల తన కుమార్తె వివాహం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున దంపతులు, మంచు విష్ణు తదితరులు హాజరయ్యారు. ఇక గుంటూరులో నిర్వహించిన రిసెప్షన్ వేడుకకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఈ వేడుకకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కాలేదు.
పవన్, అలీ మధ్య సాన్నిహిత్యం నేపథ్యంలో ఈ పెళ్లికి పవన్ కళ్యాణ్ తప్పకుండా హాజరవుతారని అంతా భావించారు. ఆయన రాకపోవడంతో దీనిపై రకరకాలుగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై తాజాగా అలీ స్పందిస్తూ.. “నా కూతురి పెళ్లికి పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించాను. శుభలేఖ కూడా ఇచ్చాను. పెళ్లికి వస్తానని ఆయన చెప్పారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా వచ్చి రూట్ మ్యాప్ చూసుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతో రాలేకపోయానని పవన్ కాల్ చేసి మరీ చెప్పారు. వధూవరులను ఇంటికి వచ్చి కలుస్తానని అన్నారు” అని వెల్లడించారు అలీ.