పవర్ స్టార్ పవన్ కల్యాన్ స్వయంగా దర్శకత్వం వహించి హీరోగా నటించిన చిత్రం ‘జానీ’. ఇందులో హీరోయిన్ గా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన అల్లు అరవింద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ పిక్చర్ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. అయితే, ఈ చిత్రం ఇప్పటికీ పవన్ అశేష అభిమానుల ఫేవరెట్ ఫిల్మ్. కాగా, ఈ సినిమా సరిగా ఆడకపోవడానికి గల కారణాలను స్వయంగా పవన్ కల్యాణ్ ఓ సందర్భంలో తెలిపారు.
సీరియస్ డ్రామాగా ‘జానీ’ సినిమా రన్ అవడం ఈ సినిమా ఆడకపోవడానికి కారణమని పలువురు సినీ పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు. కాగా, అసలు ఈ సినిమా ఆడకపోవడానికి కారణం స్టోరి అని పవన్ కల్యాణ్ తెలిపారు. తాను అనుకున్న స్టోరిని సినిమాగా తీయలేకపోయానని, కమర్షియల్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని కొంత మార్పులు చేస్తూ తీశానని చెప్పారు.
అలా అనుకున్న స్టోరిని తీయలేకపోవడం వలనే సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే, మ్యూజిక్ పరంగా ఈ ఫిల్మ్ సూపర్ హిట్ అయింది. పవన్ కల్యాణ్ ప్రజెంట్ సినిమాలతో పాటు పాలిటిక్స్ కూడా చేస్తున్నారు. ‘హరిహర వీరమల్లు’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ ను క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు.
ఈ చిత్రం తర్వాత పవన్ కల్యాణ్.. తన వీరాభిమాని అయిన హరీశ్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ పిక్చర్ చేస్తున్నారు. గతంలో వీరిరువురి కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా పలు థియేటర్లలో ‘జల్సా’, ‘తమ్ముడు’ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు.