పోసాని కృష్ణ మురళి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతోంది. దీంతో కడపకు పోసాని కృష్ణ మురళిని తరలించారట. కడప రిమ్స్ కి పోసాని కృష్ణ మురళిని తరలించారు. రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో.. ఈసీజీ పరీక్షల్లో స్వల్ప తేడాలు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు.
గుండెకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నారు పోసాని. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు. కాగా, అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు అతడినీ జైలు నుంచి రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ఆయనకు కోర్టు నిన్న 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అంటే మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు.