సూర్యపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో సాగు నీరు సక్రమంగా అందడం లేదని.. పొలాలు ఎండిపోతున్నాయని రైతుల గోస చూస కన్నీరు పెట్టుకున్నారు మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ సీఎం గా ఉన్న సమయంలో రైతులకు మేలు జరిగిందని.. కాంగ్రెస్ పాలన వచ్చిన ఏడాదిలోపే పంటలు ఎండిపోతున్నాయని భావోద్వేగానికి గురయ్యారు.
కేసీఆర్ హయాంలో రైతుల కోసం రైతు బంధు, రుణమాఫీ అందజేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతుల బాధలు కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రమే తెలుసు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులను పట్టించుకోవడం లేదన్నారు. రుణమాఫీ అందరికీ చేయలేదని.. అలాగే రైతు భరోసా కూడా కొందరికే అందిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ లక్ష కోట్లు రైతులకు ఇచ్చిండని గుర్తు చేశారు.