గతంలో రూ. 10 లక్షలు ఆర్తిఅగర్వాల్ ఫైన్ కట్టడానికి కారణం..?

-

ఆర్తి అగర్వాల్ తెలుగు తెరకు ఎంతో సుపరిచితురాలు.. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మంచి ఫాంలో ఉన్నప్పుడు మరణించడం బాధాకరం అని చెప్పవచ్చు. ఇదిలా వుండగా గతంలో 10 లక్షల రూపాయలను ఫైన్ కింద కట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఇక ఈ క్రమంలోనే తన సొంత బ్యానర్లో తప్పుచేసి పప్పుకూడు అనే సినిమాని కూడా నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమాకి కోదండరామి రెడ్డి దర్శకుడిగా పని చేయగా..ఈ సినిమా కోసం హీరోయిన్ గా నటించడానికి ఆర్థి అగర్వాల్ ను సంప్రదించారు. ఆర్తి అగర్వాల్ కూడా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. సినిమా షూటింగ్ మొదలవుతుంది అనే సమయంలో ఆర్తి అగర్వాల్ తనకు పరీక్షలు ఉన్నాయి అని చెప్పి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు . ఇక అలా ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సినిమాలో హీరోయిన్ గా గ్రేసీ సింగ్ ను ఎంపిక చేయడం జరిగింది.

షూటింగ్ పనులు జరుగుతున్నప్పుడు మోహన్ బాబు కి అసలు విషయం తెలిసింది.. ఇక ఆ అసలు విషయం ఏమంటే .. పరీక్షల కారణంగా ఆర్తి అగర్వాల్ ఆ సినిమా నుంచి తప్పుకోలేదు అని.. పరీక్ష పేరును అడ్డుపెట్టుకుని మరొక సినిమాలో నటిస్తోంది అనే విషయం ఆయన తెలుసుకున్నారు.దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ బాబు వెంటనే తనని ఫిలిం చాంబర్కు పిలిపించి ఫిలింఛాంబర్లో ఆమె పై కంప్లైంట్ చేసి 10 లక్షల రూపాయలు కట్టించారు మోహన్ బాబు. ఇక ఈ విషయం అప్పట్లో పెద్దఎత్తున సంచలనానికి దారితీసింది. ఇక అలా ఆమె 10 లక్షల రూపాయలు ఫైన్ కట్టడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version