ప్రియమణి ‘భామాకలాపం 2’.. ఈసారి థియేటర్లలో రిలీజ్

-

ప్రస్తుతం ట్రెండ్ అంతా ఓటీటీలదే. అందుకే అగ్రనేతల నుంచి స్టార్ నటుల వరకు అంతా డిజిటల్ మీడియాలోనూ తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవైపు వెండితెరపై ఓ వెలుగు వెలుగుతూనే మరోవైపు ఓటీటీల్లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలా సీనియర్ నటుల నుంచి యంగ్ నటుల వరకు అందరూ ఓటీటీ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. అలా నటి ప్రియమణి కూడా డిజిటల్ బాట పట్టింది. ఫ్యామిలీమ్యాన్ వంటి సిరీస్​తో ప్రేక్షకులను ఫిదా చేసింది.

ఇక తెలుగులో ఈ బ్యూటీ నటించిన ‘భామా కలాపం’ ఓటీటీ వేదికగా విడుదలై ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీకి కొనసాగింపుగా ‘భామా కలాపం 2’ రెడీ అవుతోంది. అభిమన్యు తాడిమేటి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సీరత్‌ కపూర్‌, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాపినీడు, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఈసారి ఓటీటీలో కాకుండా థియేటర్​లో సందడి చేయనుందట. ఈ విషయాన్ని తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసి. ‘‘తొలి భాగాన్ని మించిన థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ఈ రెండో భాగం రూపొందుతోంది. అన్ని రకాల ఎమోషన్స్‌తో ఇదొక మంచి విందులా ఉంటుంది’’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version