మరో శ్రీమంతుడు ఈ సినిమా నిర్మాత..!!

-

తెలుగు సినిమా హీరోలలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లతో సమాజ సేవ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కోవిడ్ సమయంలొ ఎంతో మంది చిన్న నటీ నటులు ఆకలితో వుండ కుండా పరిశ్రమ లోని వారి సహాయంతో వారికి ఇంటికి బియ్యం సరుకులు పంపిణీ చేశారు. అలాగే మహేష్ బాబు కూడా ఎంతో మంది గుండె జబ్బులు వున్న పిల్లలకు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉచితంగా ఆపరేషన్లు చేపించారు. అలాగే తన తండ్రి గారైన కృష్ణ గారి ఊరు అయిన బుర్రి పాలెం ను కూడా దత్తత తీసుకున్నారు.

ప్రస్తుతం కార్తికేయ2 సినిమా తో హిట్ అందుకున్న  ప్రముఖ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ కూడా అలాంటి మంచి పనికి పూనుకున్నారు. గతంలో ఈయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతో మందికి కరోనా కాలంలో తోడ్పాటు అందించారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు లాగానే అభిషేక్‌ తాజాగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి ముందకు వచ్చారు.

రంగారెడ్డి జిల్లాలోని కందుకూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. అభిషేక్ ఇప్పటికే చంద్రకళ ఫౌండేషన్‌ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు, దివంగత అమ్మమ్మ శ్రీమతి చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబందించిన కార్యక్రమాలు స్టార్ట్ కాబోతున్నాయి. అభిషేక్ లాగానే మరి కొంత మంది శ్రీమంతులు గ్రామాలను దత్తత తీసుకోవడానికి రావాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version