సంక్రాంతి వార్ కు సిద్ధ‌మవ‌తున్న రాజ‌శేఖ‌ర్ ?

-

సినిమా హీరోల‌కు సంక్రాంతి అంటే ఒక తెలియ‌ని సెంటిమెంట్ ఉంటుంది. అందుకే త‌మ సినిమా ల‌ను సంక్రాంతి కి విడుద‌ల చేయాల‌ని చూస్తుంటారు. అందులో భాగంగానే హీరో రాజ‌శేఖ‌ర్ కూడా త‌న సినిమా ను సంక్రాంతి బ‌రి లో ఉంచాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం.అయితే రాజ‌శేఖ‌ర్ హీరోగా ల‌లిత్ డైరెక్ట‌ర్ గా వ‌స్తున్న సినిమా శేఖ‌ర్. ఈ సినిమా మంచి థ్రిల్లార్ డ్రామా గా తెర‌కెక్కెతుంద‌ని స‌మాచారం. అయితే ఈ సినిమా ను రాజ‌శేఖ‌ర్ సంక్రాంతి కే విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందానికి సూచిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

అయితే ఇప్ప‌టికే ప్ర‌భాస్ రాధేశ్యామ్, ప‌వ‌న్ కళ్యాణ్ భీమ్లా నాయ‌క్, మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట సినిమా లు సంక్రాంతి స‌మ‌రంలో ఉన్నాయి. వీటి తో పాటు బంగార్రాజు, ఎఫ్ 3 సినిమాల‌ను కూడా సంక్రాంతి కి విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందాలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా లను రాజ‌శేఖ‌ర్ సినిమా త‌ట్టుకుని మంచి క‌లెక్ష‌న్ ల‌ను సంపాధిస్తుందో లేదో చూడాలి మ‌రి.

Read more RELATED
Recommended to you

Exit mobile version