రాజకీయాల్లోకి ఎందుకు రాలేదనే విషయంపై రజనీకాంత్ క్లారిటీ

-

రాజకీయాల్లోకి ఎందుకు రాలేదనే విషయం పై క్లారిటీ ఇచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. పొలిటికల్‌ ఎంట్రీ రెడి అయినా సమయంలో కరోనా వచ్చిందని.. రాజకీయాల్లో రావాలనే ప్లాన్ లో ఉన్నప్పుడు డాక్టర్లు కీలమైన సూచనలు చేశారని వెల్లడించారు. ప్రజలను కలిసే సమయం లో పది అడుగుల దూరం ఉండాలి, మాస్క్‌ వేసుకోవాలని అన్నారని రజినీ తెలిపారు.

ఆరోగ్య పరిస్థితి రీత్యా పొలిటికల్‌ ఎంట్రీ పై ఆలోచించి అడుగు వేయాలన్నారన్నారు. అప్పటికే కిడ్ని సమస్య ఉండటం …దానికి తోడు కరోనా వైరస్ తీవ్రమైన ఉన్న జనాల్లోకి వెళ్ళడం మంచిది కాదన్నారని వివరించారు. రాజకీయాల్లో రజనీకాంతరావు రావడానికి భయపడ్డాడు అన్నారని… రాజకియాల్లో రాకపోవడానికి అసలు నిజం నా ఆరోగ్యం సహకరించకపోవడమేనని తెలిపారు సూపర్ స్టార్ రజనీకాంత్.

Read more RELATED
Recommended to you

Exit mobile version