BREAKING : రామోజీరావుపై సిఐడి కేసు నమోదు !

-

మార్గదర్శి కార్యాలయాల్లో సీఐడీ దాడులు కొనసాగుతున్నాయి. విజయవాడ , గుంటూరు , విశాఖ సహా ఏడు చోట్ల తనిఖీలు చేస్తున్నారు సీఐడీ అధికారులు. 24 గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్ మేనేజర్లు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే మార్గదర్శి పై కేసు నమోదు కాగా, మార్గదర్శి చైర్మన్ చెరుకూరి రామోజీరావుపై సిఐడి కేసు నమోదు అయింది.

1982 చిట్‌ ఫండ్‌ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు. మార్గదర్శి ఎండి చెరుకూరి శైలజ, పలు బ్రాంచ్ ల మేనేజర్లపై సిఐడి కేసు నమోదు అయింది. A1 నిందితుడిగా చెరుకూరి రామోజీరావు, A 2 నిందితురాలిగా చెరుకూరి శైలజ, A 3 నిందితులుగా పలు బ్రాంచ్ల మేనేజర్లపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 120బి, 409, 420, 477ఏ, రెడ్ విత్ 34 ఆఫ్ ఐపిసి సెక్షన్ల కింద కూడడా కేసు నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version