RAJINIKANTH : పొలిటికల్ రీ-ఎంట్రీపై రజినీకాంత్ సంచలన ప్రకటన

-

గత కొంత కాలంగా సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఇస్తారని తెగ ప్రచారం జరిగిన సంగతి విదితమే. పలు సందర్భాల్లో తన అభిమానులతో మరియు సన్నిహితులతో రజినీకాంత్ సమావేశం కావడం దీనికి మరింత బలం చేకూర్చింది. ఈ క్రమంలోనే ఇవాళ తన అభిమానుల సంఘాలతో మరోసారి రజినీకాంత్ నిర్వహించారు.

ఈ సందర్బంగా  పొలిటికల్ రీ ఎంట్రీ పై సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక ప్రకటన చేశారు. రజని మక్తల్ మండ్రం రద్దు చేస్తూ రజినీకాంత్ ప్రకటన చేశారు. ఇకపై ఫ్యాన్స్ క్లబ్ గా ఉంటుందని రజినీకాంత్ స్పష్టం చేశారు. ఇక భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని క్లారిటీ ఇచ్చారు సూపర్ స్టార్ రజినీకాంత్. కాగా గతేడాది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడు అని చెప్పిన రజినీకాంత్… చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.

ఆరోగ్య పరీక్షల కోసం గత జూన్ 19న భార్య లత రజినీకాంత్ తో కలిసి అమెరికా కు వెళ్ళింది. అక్కడ మాయో క్లినిక్ ఆస్పత్రిలో రజినీ కాంత్ కు వైద్యులు పలు రకాల పరీక్షలు చేశారు. అయితే అమెరికా నుంచి తిరిగి వచ్చిన రజనీకాంత్ తాజాగా… పొలిటికల్ ఎంట్రీ ఇక ఉండబోదని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version