‘లాల్ సలామ్’ ట్రైలర్ రిలీజ్.. తలైవా యాక్షన్ అదుర్స్

-

ఇటీవలే ‘జైలర్’ సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్‌ ఆ జోష్లో వరుస సినిమాలకు సైన్ చేశారు. ఇందులో భాగంగానే ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో వచ్చిన ‘లాల్ సలామ్’ అనే సినిమాలో నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.

తాజాగా ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్వహించిన మూవీ టీమ్ లాల్ సలామ్ ట్రైలర్ను విడుదల చేసింది. ట్రైలర్లో రజనీ కాంత్ యాక్షన్ అద్దిరిపోయింది. ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్గా కనిపిస్తోంది. ఈ మూవీలో విష్ణువిశాల్‌, విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ గెస్ట్ రోల్లో కనిపించడం కొసమెరుపు. దాదాపు ఏడేళ్ల తర్వాత రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్‌ నిర్మించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version