రెండు రోజుల క్రితమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు ఉపాసన దంపతులకు పండండి ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. అపోలో హాస్పిటల్ లో మొన్న ఉదయం ఉపాసన ఆడబిడ్డకు జమను ఇచ్చింది.. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్స్ కూడా తెలియచేయడం జరిగింది. కాగా ఈ విషయాన్ని తన అభిమానులకు తెలియచేయడానికి ఒక తండ్రిగా రామ్ చరణ్ మీడియా ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ మేము ఎంతగానో ఎదురుచూస్తున్న ఆనంద సమయం వచ్చేసింది. మా ఇంటిలోకి బుల్లి పాపాయి మహాలక్ష్మి రూపంలో అడుగుపెట్టిందంటూ ఆనందాన్ని వెలిబుచ్చారు. రామ్ చరణ్ చెబుతూ మా పాప అచ్చం నాలాగే ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇక మీడియా పాప పేరు ఏమైనా అనుకున్నారా అని అడిగిన ప్రశ్నకు ఖచ్చితంగా ఇద్దరం ఒక పేరు అనుకున్నాము. అయితే అది ఏమై ఉంటుందా అన్నది తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాలంటూ సస్పెన్స్ పెట్టేశారు.