తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఉద్యోగులకు మరియు పింఛన్ దారులకు ఇప్పటి వరకు ఇస్తున్న అలవెన్స్ లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్ ను సైతం విడుదల చేయడం విశేషం. ఈ జీవో ప్రకారం ఉద్యోగులకు ట్రావెలింగ్ మరియు ఇతర అలవెన్సులు 30 శాతం పెంచింది. ఇక బదిలీలపైనా వెళుతున్న ఉద్యోగులకు ట్రాన్స్పోర్ట్ అలవెన్సు 30 శాతం పెంచడం జరిగింది. ఇక సెలవు రోజుల్లోనూ పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్ లు, డ్రైవర్ లకు అదనంగా రోజుకు రూ. 150 చెల్లించనుంది. ఇక షెడ్యూల్ ఏరియాలో పనిచేసే వారికి స్పెషల్ కంపన్సేటరీ అలవెన్స్ కింద 30 శాతం పెంచింది. దివ్యాంగ ఉద్యోగులకు ఇప్పటి వరకు ఇస్తున్న అలవెన్సును కాస్త 1000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇల్లు నిర్మించుకునే వారికి 20 లక్షల నుండి 30 లక్షలకు, కారు కొనాలి అనుకుంటే 6 లక్షల నుండి 9 లక్షలకు పెంచింది.
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త… ఉద్యోగులు, పింఛన్ దార్లకు అలవెన్సులు పెంపు
-