వ‌ర్మ‌కు బిగ్ షాక్‌: రేపు `కమ్మరాజ్యంలో కడప రెడ్లు` సినిమా రిలీజ్ లేనట్టే..

-

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించ‌బోతున్న‌ సంచలన చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. నవంబర్ 29న రిలీజ్ చేస్తామని చిత్రబృందం చెప్పినప్పటికీ.. విడుదలపై మాత్రం అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే సినిమా టైటిల్ మార్చాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిపై రామ్ గోపాల్ వర్మ తరఫు న్యాయవాది.. సినిమా టైటిల్ మారుస్తామని సెన్సార్ బోర్డుకు తెలిపారు.

అదే సమయంలో సినిమా విషయంలో అందరి అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఆ సినిమాను వారం రోజుల్లోగా చూసి, నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. కాగా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ల పాత్రలను తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version