పాఠశాలలు తెరిచే నాటికి డీఎస్సీ పూర్తవ్వాలి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశం

-

పాఠశాలలు తెరిచే నాటికి డీఎస్సీ పూర్తవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశం జారీ చేశారు. కేబినెట్ భేటీ ముగిసిన తరువాత మంత్రులతో మాట్లాడారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగటానికి వీల్లేదని సీఎం తేల్చి చెప్పారు. సమగ్ర పవర్ మేనేజ్మెంట్తో రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు వీలైతే తగ్గాలే తప్ప పెరగటానికి వీల్లేదన్నారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలను వేగవంతం చేసేలా కలెక్టర్లు, విద్యుత్ ఎస్ఈలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు.

విద్యుత్ సంస్కరణల్లో భాగంగా 7.5 లక్షల ఉద్యోగాల హామీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఎన్ని పెట్టుబడులు అమల్లోకి వచ్చాయో ఎప్పటికప్పుడు పరిశీలించి అందుకు తగ్గట్టు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేలోగా డీఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నకిలీ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏప్రిల్ లో మత్య్స కార భరోసా ఇవ్వడం పై మంత్రులు దృష్టి పెట్టాలని సూచించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version