నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈమె ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోయింది. ప్రముఖ దుస్తుల బ్రాండ్ ప్రమోషన్ షూట్ లో పాల్గొన్న రష్మిక సరికొత్తగా దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది. ఒనిట్స్క టైగర్ ఇండియా సమ్మర్ వేర్ షూట్లో రష్మిక మందన్న అదిరిపోయే గెటప్ లో కనిపించింది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ .అంతేకాదు కంప్లీట్ కొరియన్ అమ్మాయిగా కనిపిస్తున్న రష్మిక కొత్త అవతార్ పై నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు కొరియన్ అమ్మాయిలా ఉన్న ఈమె అవతారం చూసి ఇదెక్కడి ఫ్యాషన్ బాబోయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రష్మిక కెరియర్ ప్రస్తుతం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. జయాపజాయాలతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.. ఏడాది కాలంగా ఈమె ఖాతాలో ఒక్క హిట్టు కూడా లేదు. అయితే సీతారామం హిట్ అయింది. కానీ ఆ క్రెడిట్ మొత్తం మృణాల్ కే దక్కింది. ఇక తర్వాత ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా డిజాస్టర్ గా నిలవగా ఇప్పుడు హిందీ చిత్రాలైన గుడ్ బై, మిషన్ మజ్ను కూడా నిరాశపరిచాయి.
ఆ తర్వాత తమిళంలో విజయ్ కి జంటగా నటించిన భారీ చిత్రం వారిసు కూడా మిశ్రమ ఫలితాలను అందించింది. ఇక ఇటీవల రష్మిక రెండు కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. అందులో నితిన్ కి జంటగా వెంకి కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. రష్మికను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా వెంకీ కుడుముల నే.. చలో సినిమా ద్వారా ఆమె ఇండస్ట్రీకి అడుగు పెట్టి ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా అవతరించింది. రెయిన్బో అనే టైటిల్ తో ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీ కూడా చేస్తోంది.