మాస్ మహారాజా రవితేజ నటించిన వెంకీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2004లో దర్శకుడు శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా హిట్ సినిమాలను మళ్లీ రిలీజ్ చేసే రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. పెద్ద హీరోల హిట్ సినిమాలు అన్ని దాదాపు మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రారంభంలో ఈ ట్రెండ్ కి మంచి క్రేజ్ వచ్చింది.
ఆ తరువాత సమయం సందర్భం లేకుండా కుప్పలు తెప్పలుగా పాత హిట్ సినిమాలను మళ్లీ వరుస కట్టడంతో అభిమానులు సైతం లైట్ తీసుకోవడం విశేషం. వాస్తవానికి రీ రిలీజ్ మంచిదే.. కానీ దానికి ప్రత్యేక సమయం ఉండాలి. సినిమాలు పెద్దగా లేని వారం చూసుకొని విడుదల చేసుకోవాలి. కానీ కొత్త సినిమాలు పుష్కలంగా ఉన్న సందర్భంలో కూడా రీ రిలీజ్ లు అవసరమా..? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 30న వెంకీ సినిమాను రీ రిలీజ్ మేకర్స్. తాజాగా మరోసారి సెప్టెంబర్ 21, 2024న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే రీ రిలీజ్ పోస్టర్ ను విడుదల చేశారు. అభిమానులు థియేటర్లలో వెంకీ మూవీని ఆదరిస్తారో లేదో వేచి చూడాలి మరీ.