ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కేవలం టాలీవుడ్లోనే కాదు మాలీవుడ్‌లోనూ బన్నీ చాలా ఫేమస్. అక్కడి ప్రేక్షకులు బన్నీని మల్లు అర్జున్ అని ప్రేమగా పిలుచుకుంటారు. అయితే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా బన్నీకి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా.. అంతర్జాతీయంగాను అభిమానులను సంపాదించుకున్నాడు.
అయితే నార్మల్‌గానే కాదు.. సోషల్ మీడియాలోనూ అల్లు అర్జున్‌కు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాల్లో బన్నీని కోట్లమంది ఫాలో అవుతున్నారు. తాజాగా ఈ ఐకాన్ స్టార్ సోషల్ మీడియాలో మరో రికార్డు క్రియేట్ చేశాడు. ఇటీవల ట్విటర్‌కు పోటీగా కొత్తగా థ్రెడ్స్ అనే యాప్‌ను జుకర్ బర్గ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌లోనే అల్లు అర్జున్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అత్యంత తక్కువ సమయంలో వన్ మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయ నటుడిగా బన్నీ నిలిచాడు.