రీమేక్స్ ఆదరించడం లేదు కదా.. ‘గుర్తుందా శీతాకాలం’ ఓటీటీకి ఇవ్వచ్చు కదా? అభిమాని ప్రశ్నకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హీరో సత్యదేవ్..

-

తన నటనతో తక్కువకాలంలోనే విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకొని వరుస అవకాశాలు అందుకుంటున్న హీరో సత్యదేవ్ ప్రస్తుతం ఆయన నటించిన గుర్తుందా శీతాకాలం చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది ఈ సందర్భంగా తనకోసం కొన్ని విషయాలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించాడు హీరో..

2011 లో వచ్చిన ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సత్యదేవ్.. ఈ సినిమాలో మంచి నటన కనబరిచిన ఈ హీరో తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అత్తారింటికి దారేది.. ముకుంద జ్యోతిలక్ష్మి సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు తాజాగా తమన్నా హీరోయిన్గా నటించిన గుర్తుందా సీతాకాలం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..

నటుడు కాకపోయి ఉంటే మీరు ఏమయ్యా వారిని అడిగిన ప్రశ్నకు.. ఇప్పటి వరకూ ఈ విషయం గురించి ఆలోచించలేదు.. బహుశా దర్శకుడుని అయ్యి ఉండే వాడినేమో అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే అలాగే మీరు ఎన్టీఆర్ తో సినిమా చేయండి అంటూ అడగ్గా గట్టిగా కోరుకోండి తొందరలోనే నెరవేరిపోతుంది అంటూ సమాధానం ఇచ్చాడు..

అక్షయతో మీరు సినిమాలో నటించిన ఎలా అనిపించింది అని అడగ్గా అక్షయ్ కుమార్ చాలా మంచి వ్యక్తి ఆయనతో నటించడం చాలా ఆనందంగా అనిపించింది.. మరిన్ని సినిమాలు ఆయనతో కలిసి చేయాలని ఉంది ఈ సినిమా తర్వాత ఆయనకు నేను కూడా వీరాభిమానిని అయిపోయాను అంటూ సమాధానం ఇచ్చాడు సత్యదేవ్.. అలాగే ఈ కాలంలో రీమాక్స్ అంతగా హిట్ అవటం లేదు కదా మరి మీరు ఎందుకు ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేస్తున్నారు ఓటీడీకి ఇవ్వచ్చు కదా అని అభిమానులు అడిగిన ప్రశ్నకు.. ఓటీటీకి అడిగారు. కాకపోతే, ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూస్తేనే ఆ ఫీల్‌ వస్తుందని భావించాం.. అయినా ఒక ప్రయత్నం అంటూ చేస్తేనే కదా అది గెలుపైన ఓవటమైన తెలుస్తోంది.. అని చెప్పుకొచ్చారు..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version