జూనియర్ ఎన్టీఆర్ కు ఘోర అవమానం ఎదురయింది. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి రోజు.. జూనియర్ ఎన్టీఆర్ను ఘోరంగా అవమానించారు నందమూరి బాలయ్య. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ ఆదేశాల మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించినట్లు తెలుస్తోంది.
నేడు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి ఉన్న తరుణంలో హుస్సేన్ సాగర్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ ను నందమూరి సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సందర్శించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న వీరిద్దరూ సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ నుంచి వెళ్ళిన తర్వాత బాలయ్య అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని ఆయన ఆదేశించారట. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఎన్టీఆర్ ఘాట్ నుంచి తొలగించారు. ఇప్పుడు ఈ విషయం వివాదంగా మారింది. అలాగే మరోసారి నందమూరి కుటుంబ సమస్యలు తెరపైకి వచ్చాయి.