HCU ఉదంతంపై స్పందించిన రేణు దేశాయ్ !

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై తిరుగుబాటు చేశారు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉదాంతం పైన స్పందించారు రేణు దేశాయ్. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Renu Desai responds to the HCU incident

సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను… మన పిల్లలకు ఆక్సిజన్ కావాలి.. భవిష్యత్తు తరాల కోసం ఈ 400 ఎకరాల భూమిని వదిలేయండి అంటూ కోరారు. ఇప్పటికైనా వేరే దగ్గర డెవలప్మెంట్ చేసుకోమని వివరించారు. ఇలా 400 ఎకరాలు కొట్టేయడం చాలా దారుణం అన్నారు.

అటు HCU భూముల వివాదంపై స్పందిస్తున్నారు సినీ సెలబ్రిటీలు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన హీరో రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెల… HCU భూముల వివాదంపై రేవంత్ రెడ్డి సర్కార్ ను తప్పుబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news