హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో రియా చక్రవర్తికి క్లీన్ చిట్ దక్కింది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి హీరోయిన్ రియా చక్రవర్తి కారణమంటూ ఆరోపణలు చేశారు సుశాంత్ తండ్రి. ఈ కేసును దాదాపు నాలుగేళ్ల పాటు విచారణ చేసింది సీబీఐ.

ఈ కేసు క్లోజల్ రిపోర్ట్ ను ముంబయి కోర్టులో దాఖలు చేసింది సీబీఐ. సుశాంత్ ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేపించారనేందుకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని.. రియా చక్రవర్తికి ఆమె కుటుంబానికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.