ఆర్‌ఆర్‌ఆర్‌ క్లైమాక్స్‌కు రాజమౌళి ఎన్ని రోజులు తీసుకుంటాడు?

-

చాలాకాలం తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి అప్‌డేట్‌ వచ్చింది. అలాగని.. ఫలానా రోజున టీజర్‌ రిలీజ్‌ చేస్తామని… సాంగ్‌ విడుదల చేస్తామని చెప్పలేదు. క్లైమాక్స్‌ షూటింగ్‌ మంగళవారంనాడు మొదలైంది. ఈ సందర్భంగా రాజమౌళితోపాటు.. ఆర్‌ఆర్‌ఆర్‌ టీం సోషల్‌ మీడియాలో స్పందించింది. లోగోలో వుండే చేయి చేయి కలిసిన సింబల్‌ను రివీల్‌ చేశాడు జక్కన్న.

క్లైమాక్స్‌ షూట్‌ మొదలైందంటూ ట్వీటర్‌లో పోస్టు చేసింది ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌. లక్ష్యాన్ని సాధించేందుకు రామరాజు, భీమ్‌ వస్తున్నారంటూ .. క్లైమాక్స్‌కు సంబంధించిన ఒక ఫొటోను కూడా పంచుకుంది. అయితే.. పతాక సన్నివేశాన్ని ఆల్రెడీ మొదలుపెట్టారని.. బ్యాలెన్స్‌ పార్ట్‌ను వారం రోజులపాటు షూట్ చేస్తున్నారట. పర్‌ఫెక్షన్‌ వచ్చేవరకు వదలని జక్కన్న క్లైమాక్స్‌ పూర్తవడానికి ఎన్ని రోజులు తీసుకుంటాడో చూడాలి మరి.

కారణం ఏదైనా.. ఎప్పటికప్పుడు షూటింగ్‌కు బ్రేకులు పడడంతో.. ఫిబ్రవరిలో పూర్తికావాల్సిన షూట్ ఏప్రిల్‌ వరకు వెళ్లింది. అలియా, చెర్రీపై సీన్స్‌తోపాటు పాట చిత్రీకరించాల్సి వుంది. మరోవైపు విజువల్‌ ఎఫెక్ట్స్‌ జరుగుతున్నాయి. జక్కన్న బైటపెట్టడం లేదుగానీ.. వీలైతే.. దసరాకు రిలీజ్‌ చేయాలన్న పట్టుదలతో వున్నాడట.

ఈ క్లైమాక్స్‌లో 150 మంది ఫైటర్స్‌ పాల్గొంటున్నారని తెలిసింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ యాక్షన్‌ పార్ట్‌ డిజైన్‌ చేయడంతో.. ఫైటర్స్‌కు చాలా రోజులుగా సోల్‌మాన్‌ రాజు నేతృత్వంలో ట్రైనింగ్‌ తీసుకున్నారు. గత సినిమాల్లోని ఫైట్స్‌ను తలదన్నేలా రాజమౌళి తీస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ క్లైమాక్స్‌ ఎలా వుండబోతోందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version