ఫీమేల్ కండోమ్స్… అసలుంటాయని ఎంతమందికి తెలుసు.. వాటి సమాచారం మీకోసం..

-

సురక్షిత శృంగారం కోసం కండోమ్ వాడడం తప్పనిసరి. ఐతే కండోమ్ అనగానే మేల్ కండోమ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. ఫీమేల్ కండోమ్స్ ఉంటాయని చాలా మందికి తెలియదు. అసలు ఇంతవరకూ వినని వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు ఫీమేల్ కండోమ్స్ ఎలా వాడాలి. ఎలాంటి రక్షణ ఇస్తుందో ఇక్కడ చూద్దాం.

ఫీమేల్ కండోమ్ ఎలా వాడాలో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలిసినా కూడా ఎలా వాడాలో తెలియక పెద్దగా పట్టించుకోని వాళ్ళు ఎక్కువ. ఐతే ఫీమేల్ కండోమ్స్ వాడడానికి మహిళలు కూడా ఆసక్తి చూపరు. మేల్ కండోమ్ సరిపోతుందన్న భావనే కాక, అవసరమా అన్న నిర్లక్ష్యం కూడా ఒకటి.

కానీ ఫీమేల్ కండోమ్స్ చాలా మేలు చేస్తాయి. అవసరం లేని గర్భం రాకుండా ఉండడానికి గానీ, శృంగారం వల్ల వ్యాపించే సుఖ వ్యాధులు రాకుండా ఉండడానికి గానీ చాలా ఉపయోగపడతాయి. అసురక్షితంగా రెండు శరీరాలు కలవడం వల్ల కలిగే ఇబ్బందులని ఫీమేల్ కండోమ్స్ దూరం చేస్తాయి. ప్రతీసారీ మేల్ కండోమ్స్ పై నమ్మకం పెట్టుకోకుండా తమ రక్షణ తాము తీసుకుంటే మంచిది. దానికి ఫీమేల్ కండోమ్స్ చాలా పనిచేస్తాయి.

ఐతే చాలా మందికి ఫీమేల్ కండోమ్స్ ఉంటాయనే తెలియదు. ఇక దాని వాడకం గురించి అస్సలు తెలియదు. ఫీమేల్ కండోమ్ ని యోని లోపలి భాగంలో ధరించాల్సి ఉంటుంది. శృంగారం జరపడానికి కొన్ని గంటల ముందే యోనిలోపల ధరించాల్సి ఉంటుంది. ఇది వాడడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఎక్కువ సేపు యోని లోపల ఉండడంతో అప్పుడప్పుడు దురద లాంటిది కలిగే అవకాశం ఉందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version