ఇంత ఎనర్జీ, ఫిట్నెస్ ఆ ఒక్క విషయంతోనే సాధ్యమైందంటున్న సాయి పల్లవి

-

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. తన నటన డాన్స్ తో అభిమానుల్ని మెస్మరైజ్ చేయగలిగే ఈ బ్యూటీ 2015 లో వచ్చిన ప్రేమమ్ సినిమాతో హీరోయిన్గా కెరీర్ ను ప్రారంభించారు. అయితే కెరీర్ స్టార్టింగ్ లో ఎలా ఉన్నారో ఇప్పటివరకు అంతే అందంగా కనిపిస్తూ వస్తున్నారు సాయి పల్లవి తాజాగా ఈ విషయంపై స్పందించిన ఈ భామ తన అందమైన రహస్యం ఏంటో చెప్పేసింది..

మలయాళంలో విడుదలైన ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది సాయి పల్లవి.. అనంతరం 2016 తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో తన నటనతో చెరగని ముద్ర వేశారు సాయి పల్లవి. తర్వత ఎమ్మెల్యే, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇప్పటికీ తాను ఓ స్టార్ హీరోయిన్ అనే విషయాన్ని మర్చిపోయి చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు సాయి పల్లవి మేకప్ ఫ్యాషన్ అన్నిటికీ దూరంగా ఓ సాధారణ అమ్మాయిలా అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు.. కథలో హీరోయిన్ పాత్రకు యాక్టింగ్ స్కోప్ ఉంటేనే చేస్తాను అంటుంది. లేదంటే నిర్మోహమాటంగా నోచెప్పేస్తుంది.

ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే గ్లామర్ గా ఉండాలి ఫిట్నెస్ మైంటైన్ చేయాలి ఇందుకోసం చాలామంది హీరోయిన్స్ కోట్లలో ఖర్చు పెడుతూ ఉంటారు జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ ఉంటారు దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేయగా సాయి పల్లవికి సంబంధించి మాత్రం ఇలాంటి విషయాలు ఎప్పుడూ కనిపించవు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె తన ఫిట్ నెస్ సీక్రేట్ ను బయట పెట్టింది. తాను ఇంత నాజూగ్గా ఉండటానికి కారణం ఏంటో కూడా వెల్లడించింది. .. తనను అందరూ తన ఫిట్ నెస్ గురించి అడుగుతుంటారని.. కాని నేను దాని కోసం ప్రత్యేకంగా ఎలాంటి కసరత్తులు చేయను. అన్నారు సాయి పల్లవి. ఇలా నాజూగ్గా ఉండటానికి కారణం మాత్రం డాన్స్ అని అంటుంది సాయి పల్లవి. ఏ మాత్రం ఖాళీ దొరికినా నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాను. అదే నా ఫిట్ నెస్ కి కారణం. మేకప్ వేసుకుంటే నాపై ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందునే నేను ఏ సినిమాకు పెద్దగా మేకప్ వేసుకోను.. నేను బయట ఎలా ఉంటానో అలాగే కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడతాను అని అన్నారు. అయితే నాకు ఎంతో ఇష్టమైన డాన్స్ నాకు ఇంతటి పేరు ప్రతిష్ఠలను తెచ్చిపెడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ అంటూ తెలిపారు సాయి పల్లవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version