ఆసియా కుబేరుడిగా ముకేశ్ అంబానీ.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ర్యాంక్ అంటే..?

-

వచ్చేసింది.. 2023 ఏడాదికి ప్రతిష్టాత్మక ఫొర్బ్స్ 37వ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా వచ్చేసింది. ప్రతి ఏడాది లాగే.. ఈ ఏడాది కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ నేత ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈసారి ముకేశ్ అంబానీ 9వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సంపద 83.4 బిలియన్ల డాలర్లుగా ఉంది. దీంతో ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. గతేడాది 90.7 బిలియన్​ డాలర్ల సంపదతో 10వ స్థానంలో ఉన్న అంబానీ.. ఈ ఏడాది ఓ మెట్టు పైకి ఎక్కారు.

తాజా జాబితాలో మైక్రోసాఫ్ట్‌కు చెందిన స్టీవ్ బాల్మర్, గూగుల్‌కు చెందిన లారీ పేజ్- సెర్గీ బ్రిన్, ఫేస్‌బుక్‌ అధినేత మార్క్ జూకర్‌బర్గ్, డెల్ టెక్నాలజీస్‌కు చెందిన మైఖేల్ డెల్ కంటే ముకేశ్​ అంబానీ ఎగువ స్థానంలో ఉన్నారు. మరోవైపు భారత్​లోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగిన గౌతమ్​ అదానీ.. తన కంపెనీల షేర్ల ధరలు పతనమైన కారణంగా ఈ ఏడాది 24వ స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 47.2 బిలియన్ డాలర్లని అంచనా.

Read more RELATED
Recommended to you

Exit mobile version