న్యూయార్క్​లో ‘ఇండియా డే పరేడ్​’లో సమంత.. వీడియో వైరల్

-

న్యూయార్క్‌లో జరిగిన ‘ఇండియా డే పరేడ్‌’లో భారతీయ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్​ ఈ పరేడ్​లో సందడి చేశారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా న్యూయార్క్‌లో నిర్వహించే ఈ వేడుకలు ఆదివారం రోజున మధ్యాహ్నం ఘనంగా జరిగాయి. సమంతను చూసి అక్కడి తెలుగు వాళ్లంతా ఫుల్ ఖుష్ అయ్యారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

ఈ వేడుకలో సామ్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు న్యూయార్క్‌లో ఉండడం చాలా గర్వంగా ఉంది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఎంతగొప్పవో, ఈరోజు నేను చూసిన దృశ్యాలు మరోసారి అర్థమయ్యేలా చేశాయి. ఈ క్షణాలు నా మదిలో జీవితమంతా నిలిచి ఉంటాయి. ఈ అరుదైన గౌరవం నాకు దక్కేలా చేసిన అందరికీ ధన్యవాదాలు. అలాగే నా సినిమాలను ఆదరిస్తున్నందుకు అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు’’ అని చెప్పుకొచ్చారు. సమంతతో పాటు మరికొంతమంది నటీనటులు, ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version