‘ఇది టార్చర్ టైం’ అంటూ సమంత పోస్టు.. ఆందోళనలో ఫ్యాన్స్

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే యాక్షన్ వెబ్​ సిరీస్​లో నటిస్తోంది. ఈ సిరీస్​ కోసం సామ్ చాలా కష్టమైన స్టంట్స్ కూడా చేస్తోంది. ఇటీవలే షూటింగ్​లో భాగంగా రెండు చేతులకు గాయాలైన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఓ కొత్త ఫొటోనూ పోస్ట్​ చేసి ‘ఇట్స్​ టార్చర్ టైమ్’ అని రాసుకొచ్చింది.

ఐస్​ బాత్​ టబ్​లో కూర్చున్న ఫొటోను పోస్ట్ చేసింది సామ్. యాక్షన్​ సీన్స్​లో నటిస్తున్నట్లు చెప్పిన సామ్​.. టార్చర్​లా ఉందని.. రికవరీ కోసం ఇలా ఐస్​ బాత్​ టబ్​లో కూర్చొని ఉపశమనం​ పొందుతున్నట్లు చెప్పుకొచ్చింది. మరి ఇంత కష్టపడుతున్న సమంతకు ‘సిటాడెల్’ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ ఫొటో చూసి మొదట అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సామ్​కు ఏమైందంటూ తెగ బాధపడిపోయారు. అసలు సంగతి తెలిశాక ఊపిరి పీల్చుకున్నారు.

సిటాడెల్ ఇంటర్నేషనల్ వెబ్​సిరీస్​. ఇంగ్లీష్ వెర్షన్​లో ప్రియాంక చోప్రా నటించగా.. ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తోంది. ఇప్పటికే ప్రియాంక చోప్రా నటించిన సిరీస్​ ఏప్రిల్ 28న రిలీజై.. అమెజాన్​లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version