విడాకుల తర్వాత నాగ చైతన్యతో సమంత సినిమా !

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా అందమైన జంట ఏది అంటే గుర్తుకు వచ్చేది.. అక్కినేని నాగచైతన్య- సమంత అనే చెబుతారు. కానీ ఆరు నెలల కిందట.. తమ వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించేశారు. ఇక విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది సమంత. ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే… తన స్నేహితులతో… విహార యాత్రలకు వెళుతోంది.

అలాగే ఈ మధ్య జిమ్ లో చేసే వర్క్ ఔట్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది సమంత. ఇది ఇలా ఉండగా నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన ఓ బేబీ.. సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించిన నాగచైతన్య… ఇప్పుడు హీరోగా నందిని రెడ్డి తో చేతులు కలపనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను వైజయంతి మూవీస్ పతాకంపై స్వప్న దత్ నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఇందులో నాగచైతన్య సరసన సమంత హీరోయిన్ గా తీసుకునేందుకు నందినిరెడ్డి ఆలోచన చేస్తున్నారట. విడాకుల తర్వాత వీరి కాంబినేషన్ లో మూవీ వస్తే.. బాగుంటుందని భావిస్తోందట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version