సరిలేరు నీకెవ్వరు, మేకింగ్ వీడియో చూసారా…?

-

మహేష్ బాబు హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. మహర్షి సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సినిమా ప్రచారం భారీగా జరుగుతుంది. గురువారం సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియోను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. మేకింగ్ వీడియోలో చిత్ర సెట్స్‌తో పాటుగా సినిమాలోని కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చూపించారు. కర్నూలు కొండారెడ్డి బురుజు, ట్రైన్ సీన్స్ లాంటివి ఈ వీడియోలో ప్రధానంగా చూపించారు. దీనితో సినిమాపై అంచనాలను భారీగా పెరిగిపోయాయి.

ఈ సినిమాతో అలనాటి అగ్ర హీరోయిన్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నట కిరీటి రాజేంద్రప్రసాద్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ,రావు రమేష్, కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు , అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు ఈ సినిమాని నిర్మించారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో గాని, విజయశాంతి అభిమానులు మాత్రం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version