‘ సరిలేరు ‘ ఫంక్షన్ : ఎల్బీ స్టేడియంలో – లేడీ ఫాన్స్ రచ్చ రచ్చ

-

 

ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల సందడి మొదలైపోయింది. ఇక ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న నాలుగు సినిమాల తాలూకు ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ముందుగా రజినీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దర్బార్ సినిమా ఈ నెల 9న రిలీజ్ కాబోతుండగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న ఎంతో వైభవంగా జరిగింది.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు ఎంతో వైభవంగా జరుగనుండగా సినిమాని ఈనెల 11న రిలీజ్ చేస్తున్నారు.

 

 

ఇవాళ హైదరబాద్ LB స్టేడియం లో జరుగుతున్నా సరిలేరు నీకేవ్వరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి జనం విపరీతంగా వచ్చారు .. ముఖ్యంగా మహేశ్ బాబు కోసం లేడీ ఫాన్స్ తండోపతండాలు గా వచ్చారు . మహేశ్ బాబు కి ఉన్న లేడీ ఫాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే .. అయితే ఫంక్షన్స్ విషయం లో వారు కాస్తంత దూరంగా ఉంటూ ఉంటారు .. థియేటర్ ల వరకూ ఎక్కువగా వెళతారు కానీ ఇలా ఫంక్షన్ లలో తోపులాటలు ఉంటాయి అనే ఫీలింగ్ తో పెద్దగా ఆసక్తి చూపించారు.

 

అలాంటిది ఇప్పుడు లేడీ ఫాన్స్ కూడా ఎగబడి మరీ ఎల్బీ స్టేడియం లో కనిపించడం చాలా క్రేజీ గా అనిపించింది.. కేవలం యూత్ గర్ల్స్ మాత్రమే కాకుండా పెళ్ళయిన వారు , పెద్ద వాళ్ళు కూడా రావడం తో ఫామిలీస్ లో మహేశ్ క్రేజ్ ఏ మేరకు ఉంది అనేది స్పష్టం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version