‘అల వైకుంఠపురములో’ స్టోరీ రివీల్ చేసిన త్రివిక్రమ్….!!

-

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా అలవైకుంఠపురములో. జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుంది. కాగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు / ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమాకి సంబంధించి రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించనుంది సినిమా యూనిట్. మ్యూజికల్ కన్సర్ప్ట్ పేరుతో జరుగనున్న ఈ ఈవెంట్ కు ప్రత్యేక అతిథులు ఎవరూ లేరని, సినిమా యూనిట్ సభ్యులే దీనిలో ప్రత్యేకంగా దీనిలో పాలుపంచుకోనున్నారని టాక్. పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక మరియు హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా స్టోరీ ని లైన్ ఎలా ఉంటుంది అనే దానిపై నేడు ఒక ప్రముఖ పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. మన జీవితంలో ఎవరికైనా స్థానం ఇవ్వగలమేమో గానీ, స్థాయిని ఇవ్వలేం అనేదే ఈ సినిమా యొక్క కేంద్ర కథా బిందువని అన్నారు. వాస్తవానికి సంపద, ఐశ్వర్యం అనేవి రెండు వేరు వేరు. మనం ఎవరైనా గొప్పోళ్ళ ఇంటికి వెళితే, కాసేపటికి  చాలావరకు బోర్ కొట్టేస్తుంది. అదే మధ్యతరగతి వారి ఇంట్లోకి వెళ్లి చూస్తే, హాయిగా బాల్కనీలో కూర్చుంటే, ప్రక్కనే ఉన్న మల్లె పాదు నుండి వచ్చే సువాసన, రేడియోలో పాటలు, దానితో పాటు బంగాళాదుంపల కూర మండుతున్న వాసన వస్తుంటే ఎంతో ఆకలి వేయడం, అనంతరం హాయిగా ఒక టీ తాగి వెళ్లిపోతుంటే, ఆ ఇంట్లో వారు భోజనం చేసి వెళ్లమని అడగడం, తరువాత వారితో కలిసి తినడం వంటివి మనకు చాలావరకు అన్నీ ఎంతో సంతోషాన్ని ఇస్తాయి.

 

ఈ విధంగా చూసుకుంటే గొప్పింటిలో కేవలం సంపద ఉంటే, ఇక్కడ పలు విధాలుగా ఐశ్వర్యం ఉంటుంది. ఈ అంశాన్నే సరదాగా చెప్పాలనుకుని ఈ కథ రాశారట త్రివిక్రమ్. వినడానికే గొప్పగా అనిపిస్తున్న ఈ కథ ఇక తెరపై ఎలా ఉంటుందో జనవరి 12న చూడొచ్చు. మరోవైపు టాలీవుడ్ కు కొంత లాంగ్ గ్యాప్ తరువాత సీనియర్ నటి టబు ఈ సినిమా తో రీఎంట్రీ ఇస్తుండడం విశేషం అని చెప్పాలి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ తో ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్  సంపాదించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి…..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version