అవకాశాల కోసం బ్రతిమలాడుతున్న సీనియర్ నటి.. ఏమైందంటే..?

-

సినిమా ఇండస్ట్రీ అనే మాయా ప్రపంచంలో ఎప్పుడు.. ఎవరు.. ఎక్కడ ఉంటారో చెప్పడం చాలా కష్టం.. కొంతమందికి అవకాశాలు వస్తూ ఉన్నత స్థానానికి చేరుకుంటే.. మరి కొంతమందికి మొదట్లో అవకాశాలు వచ్చినా.. ఆ తర్వాత కాలంలో ఇండస్ట్రీ నుంచి దూరం అవుతూ ఉంటారు. అయితే ఇంకొంతమంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అవకాశాలు అందుకుంటుంటే ఇంకొంతమంది మాత్రం కనీసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ తెగ బ్రతిమలాడుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి, సీనియర్ యాంకర్ అనితా చౌదరి కూడా ఒకరు.

కొన్నేళ్ల క్రితం వరకు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నా.. ఇప్పుడు మాత్రం సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు. ఉయ్యాల జంపాల, ఛత్రపతి, నువ్వే నువ్వే వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న అనిత చౌదరి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను మీడియాతో పంచుకుంది. కస్తూరి కోసం తొలిప్రేమ సినిమాలో ఛాన్స్ వదులుకున్నానని తెలిపిన ఈమె కస్తూరి ఫస్ట్ డైలీ సీరియల్ అని కామెంట్లు చేసింది. నేను వదులుకున్న మంచి సినిమాలు ఎన్నో ఉన్నాయి. నేను ఫ్యామిలీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాను. మనకు రాసి పెట్టింది మనకే దక్కుతుంది అంటూ కామెంట్లు చేసింది అనితా చౌదరి . ఇకపోతే హీరోయిన్ గా చాలా అవకాశాలు వచ్చాయని కొత్త హీరోలు ట్రెండ్ అప్పట్లో ఎక్కువగా లేదని కూడా కామెంట్లు చేసింది.

ఇకపోతే కృష్ణవంశీ గారిని చాన్స్ ఇవ్వాలని అడిగానని.. తన జీవితంలో అన్ని రోజులు ఉన్నాయి అంటూ ఆమె తెలిపింది. ఏఎన్ఆర్ కుటుంబంతో నాకు మంచి అనుబంధము ఉండేది . ఆయన తోట నుండి జామకాయలు తెప్పించి మరీ నాకు ఇచ్చేవారు. నాగార్జున గారు గొప్ప టీచర్. ఆయన ఎప్పుడూ నాపై పంచులు వేస్తూ ఉండేవారు అంటూ తెలిపింది . ఇక బాలయ్య ,చిరంజీవి సినిమాలలో అవకాశాలు రావాలి అని, పవన్ సినిమాలో కూడా అవకాశం వస్తే బాగుంటుందని.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ బ్రతిమలాడుకుంటుంది అనితా చౌదరి. మరి ఈమె కోరిక మేరకు తనకు సినిమాలలో అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version