విజయ్ దేవరకొండ కి అతిపెద్ద ఛాలెంజ్ ..

-

కరోనా వైరస్ తెచ్చిన తిప్పలు వల్ల పేద మరియు మధ్యతరగతి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాలు ఒకపక్క రేషన్ ఇస్తూ మరోపక్క నగదు ఇస్తున్న గాని వాటివల్ల కొద్దిరోజులే గడిచే పరిస్థితి నెలకొంది. దీంతో మళ్లీ చేయి చాచే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి సమయం లో చాలామంది సెలబ్రిటీలు ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటిస్తూ మరోపక్క సహాయం కూడా చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా కరోనా వైరస్ వల్ల బాధ పడుతున్న కుటుంబాలను ఆదుకోవడానికి రెడీ అయిన సంగతి అందరికీ తెలిసినదే. ఇందుకోసం చాలా డిఫరెంట్ గా తన పేరిట చారిటీ స్థాపించి, ఒక వెబ్ సైట్ కూడా పెట్టడం జరిగింది. దాదాపు ఈ వెబ్ సైట్ ద్వారా కరోనా వైరస్ వల్ల బాధ పడుతున్న కుటుంబాలు ఆన్లైన్ దరఖాస్తు చేసుకుంటే, నేరుగా ఇంటికి వెయ్యి రూపాయలు విలువ చేసే సరుకులు పంపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

 

అయితే ఈ వెబ్ సైట్ లో 63 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీళ్ళందరికీ సహాయం చేయాలంటే కనీసం ఆరు కోట్లకు పైగానే డబ్బులు అవుతాయి. కానీ విజయ్ కేటాయించింది పాతిక లక్షలే. అంచనాలకు మించి చాలా మంది దరఖాస్తు చేసుకోవడంతో మిగిలిన వాళ్ల కోసం విజయ్ దేవరకొండ చారిటీ అడుగుతున్నాడు. విజయ్ దేవరకొండ కి ఇది పెద్ద అతి పెద్ద చాలెంజ్ గా మారింది. మ్యాగ్జిమం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సరుకులు అందేలా సహాయం చేయడం కోసం బాగా డెడికేషన్ గా పని చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version