కేజీయఫ్ యశ్‌ టాక్సిక్ మూవీలో షారుక్‌ ఖాన్?

-

గతేడాది పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఈ ఏడాది ఎలాంటి సినిమాలతో సందడి చేస్తాడా అని ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు షారుక్ తన నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా షారుక్ నెక్స్ట్ మూవీ గురించి ఓ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే?

కన్నడ స్టార్ హీరో యశ్‌ నటిస్తున్న ‘టాక్సిక్‌’ సినిమాలో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్లో అలరించనున్నారట. ఈ సినిమాను గీతూ మోహన్‌ దాస్‌ తెరకెక్కిస్తున్నారు. ‘గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో గెస్ట్ రోల్ కోసం షారుక్తో గీతూ మోహన్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలో దీని గురించి అధికారికంగా ప్రకటించనున్నారటయ మాస్‌, యాక్షన్‌ అంశాలను మేళవించి రెండు వేర్వేరు ప్రపంచాల కలయికగా ఈ సినిమా కథ ఉండబోతుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా సాయి పల్లవి నటించనున్నట్లు సమాచారం. దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version