‘జవాన్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

-

ఐదేళ్ల తర్వాత బాలీవుడ్​ స్టార్​ హీరో షారుక్​ ఖాన్​ మళ్లీ ఫామ్​లోకి వచ్చాడు. పటాన్, జవాన్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇక తాజాగా జవాన్ చిత్రంతో వసూళ్లలో నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్​తో షారుక్.. అదరగొట్టే పర్ఫామెన్స్ ఇచ్చాడు. డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో షారుక్ సరసన, దీపికా పదుకోణ్, నయనతార నటించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌లో షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు.

థియేటర్​లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే థియేటర్​లో మొన్నటిదాక కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమాను అప్పుడే ఓటీటీలోకి తీసుకాబోం అని డైరెక్టర్ అట్లీ చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

సెప్టెంబర్ 7న హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన జవాన్ సినిమా.. నవంబరు 2వ తేదీ నుంచి నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ కానున్నట్లు తెలుస్తోంది. షారుక్​ బర్త్​డే అయిన నవంబరు 2న ఓటీటీ రిలీజ్​ చేయునున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే థియేటర్లలో లేని మరికొన్ని సన్నివేశాలను యాడ్ చేసి మరి ఓటీటీలో విడుదల చేయనున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version