అశ్లీల సినిమాల చిత్రీకరణలో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా హస్తం ఉందంటూ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త అయిన రాజ్ కుంద్రా అరెస్ట్ కావడంతో అందరి చూపు శిల్పాశెట్టి మీదకు మళ్ళింది. శిల్పాకి కూడా ఈ వ్యవహారంలో ఏదైనా సంబంధం ఉందా అన్న విషయంలో విచారణ సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని జుహులో ఉన్న శిల్పా నివాసాన్ని పోలీసులు రైడ్ చేసారు.
ప్రాథమికంగా శిల్పాశెట్టికి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని తెలిసింది అధికారులు పేర్కొన్నారని మిడ్ డే ప్రచురించింది. అయితే రాజ్ కుంద్రా నివాసంలో 6 గంటలకు పైగా తనిఖీలు చేపట్టారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. రాజ్ కుంద్రా నిర్మించింది పోర్న్ సినిమాలు కాదని, అవి ఎరోటిక్ సినిమాలేనని, శృంగార భరిత సున్నిత సినిమాలేనని, ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో అంతకంటే ఎక్కువ ఎరోటిక్ గా ఉన్న సీన్లు ఉంటున్నాయని శిల్పాశెట్టి తెలిపిందని విచారణ అధికారులు తెలిపారు.
అటు రాజ్ కుంద్రా ఐ వ్యాపారంలో తనకు సంబంధం లేదని అధికారులతో అన్నారు. కానీ, హాట్ షాట్ వ్యవహారం అంతా రాజ్ కుంద్రానే చూసుకుంటున్నాడని, లండన్ లో ఉన్న వ్యక్తి కేవలం నామమాత్రంగానే ఉన్నాడని నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్ కుంద్రాని జులై 27వ తేదీ వరకు కస్టడీలో ఉంచాలని తీర్పు వచ్చింది. రాజ్ కుంద్రా తరపు లాయర్ బెయిల్ అప్లై చేసినప్పటికీ కోర్టు తిరస్కరించింది.