కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబురాలు.. హాజరైన ప్రధాని

-

దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీకి కిషన్ రెడ్డి, చిరంజీవి, శ్రీనివాస వర్మ స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, గజేంద్ర షెకావత్, తదితర మంత్రులు, తెలుగు రాష్ట్రాల ఎంపీలు, ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోగి మంటలను అంటించారు. అలాగే దీపారాధన చేశారు.

కిషన్ రెడ్డి ప్రధాని మోడీకి ఒక జ్ఞాపికను అందించారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రధాని నరేంద్ర మోడీ పక్క పక్కనే కూర్చోవడం విశేషం. ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి కూడా హాజరయ్యారు. సంక్రాంతి సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బసవన్న ఆశీర్వాదాలు, కథలు, డ్యాన్స్ తదితర కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version