ఆర్జీవీకి షాక్.. వ్యూహం సినిమాకి హైకోర్టులో దక్కని ఊరట

-

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. ఈ సినిమా పై తెలంగాణ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఫిబ్రవరి 09లోగా సెన్సార్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ.. ఇటీవలే సింగిల్ బెంచ్ కోర్టు తీర్పును వెల్లడించింది. సినిమా పై సెన్సార్ బోర్డు రివ్యూ చేసి నాలుగు వారాలలోపు రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది చిత్ర యూనిట్.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాని నారా లోకేష్ ఈ సినిమా పై పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ స్వ లాభం కోసం ఈ సినిమాను తెరకెక్కించారని పిటిషన్ లో పేర్కొన్నాడు నారా లోకేష్. ఇక ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు.. ఈనెల 11 వరకు విడుదలను నిలిపివేస్తూ.. ఉత్తర్వులను జారీ చేసింది. అనంతరం ఈ తీర్పును సవాల్ చేస్తూ.. నిర్మాత హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version