ఆస్కార్ వేడుకల్లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర తెలిస్తే షాక్..!

-

ప్రస్తుత కాలంలో చాలామంది హీరోలు, హీరోయిన్లు ఎక్కువగా ఫ్యాషన్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకోసం కోట్లు ఖర్చుపెట్టడానికి కూడా వెనుకాడడం లేదు. సాధారణంగా చిన్న చిన్న ఫంక్షన్లకు పార్టీలకు కూడా లక్షల విలువ చేసే దుస్తులు, వాచ్లు , బ్యాగులు ధరించే మన సెలబ్రిటీస్.. ఆస్కార్ వంటి అంతర్జాతీయ ఫంక్షలకు మరే రేంజ్ లో వారు విలువైన వస్తువులను ఉపయోగిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆస్కార్ 95వ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం లాస్ ఏంజిల్స్ లో చాలా ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు అటు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన అలాగే ఎన్టీఆర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

ఇకపోతే ఈసారి మన ఇండియాకి రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి. అందులో ఒకటి డాక్యుమెంటరీ ఫిలిం ది ఎలిఫెంట్ చిత్రానికి రాగా.. మరొకటి ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు లభించింది. అయితే ఈ ఆస్కార్ వేడుకలలో కూడా మన హీరోలు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో అలరించారు. ఈ క్రమంలోని మన నేటిజన్స్ కన్ను ఇప్పుడు ఎన్టీఆర్ వాచ్ పై పడింది. ఆయన ధరించిన వాచ్ విలువ తెలుసుకొనే పనిలో పడ్డారు.

తీరా ఆ వాచ్ ధర తెలుసుకొని ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్.. “Patek Philippe Nautilus Travel Time” ఈ వాచ్ ధర అక్షరాల 1,90,000 డాలర్లు.. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.1,56,13,150 అన్నమాట.. ఈ వాచ్ ధర తెలుసుకొని నేటిజెన్లు పూర్తిస్థాయిలో షాక్ అవుతున్నారు.ఏది ఏమైనా ఇంతటి కాస్ట్లీ వాచ్ ధరించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు ఎన్టీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version