‘సైమా అవార్డ్స్‌ 2023’ నామినేషన్స్‌ జాబితా ఇదే

-

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) – 2023 వేడుకలు ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ అవార్డు కోసం పోటీపడే చిత్రాల జాబితా విడుదలైంది. ఇందులో బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఏకంగా 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కించుకుంది. తర్వాత 10 కేటగిరిల్లో ‘సీతారామం’కి నామినేషన్స్‌ దక్కాయి. ‘ఉత్తమ చిత్రం’ కేటగిరిలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’, సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’, నిఖిల్‌ మిస్టరీ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ‘కార్తికేయ2’, అడవి శేష్‌ ‘మేజర్‌’లతో పాటు డీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘సీతారామం’ పోటీ పడుతున్నాయి. దుబాయ్‌లోని డి.డబ్ల్యూ.టి.సిలో సైమా వేడుక జరగనుంది.

ఇక తమిళంలో అత్యధికంగా 10 నామినేషన్స్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’ చిత్రానికి దక్కాయి. ఆ తర్వాత కమల్‌హాసన్‌-లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘విక్రమ్‌’ 9 నామినేషన్స్‌ను దక్కించుకుంది. కన్నడలో చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన రిషబ్‌శెట్టి ‘కాంతార’, యశ్‌, ప్రశాంత్‌ నీల్‌ మాస్‌, యాక్షన్‌ మూవీ ‘కేజీయఫ్‌2’లకు 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version