Singer Mangli : సింగర్ మంగ్లీ కి తీవ్ర గాయాలు

-

జానపద పాటలకు పెట్టింది పేరు సింగర్ మంగ్లీ.. ఆమె గొంతు నుంచి జాలువారిన ప్రతి పాట కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మంగ్లీ పాడిన పల్లె పాటలకు వస్తున్న ఆదరణ చూసి టాలీవుడ్ సైతం ఆశ్చర్యపోతోందని చెప్పవచ్చు. అందుకే మంగ్లీకి సినిమా పాటలు పాడే అవకాశాన్ని కూడా కల్పించింది చిత్ర పరిశ్రమ.

అయితే సింగర్ మంగ్లీ కాలికి తీవ్ర గాయం అయింది. తెలంగాణ రాష్ట్రంలో బోనాలు జరుగుతున్న సందర్భంగా ఓ ప్రైవేట్ సాంగ్ షూటింగ్ లో ఆమె పాల్గొన్నారు. అయితే షూటింగ్ ఆ సమయంలో మంగ్లీ కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆమె కాలికి తీవ్ర గాయం అయింది. వెంటనే సాంగ్ యూనిట్ సభ్యులు… సింగర్ మంగ్లీని ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు సమాచారం అందుతుంది. అనంతరం సింగర్ మంగ్లీని డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం అందుతుంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version