Singer Sunitha: మీకో దండం రా నాయనా..ప్రెగ్నెన్సీపై క్లారిటీనిచ్చిన సునీత

-

టాలీవుడ్ సింగర్ సునీత..మరోసారి తల్లి కాబోతుందన్న వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రసారమయ్యాయి. కాగా, ఈ వార్తలపై గాయని సునీత స్పందించారు. నిజానికి ఆమె ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన పోస్టులో ‘బ్లెస్డ్’ అనే క్యాప్షన్ తో మామిడి తోటలో దిగిన ఫొటో షేర్ చేసింది. అంతే.. ఆమె ప్రెగ్నెంట్ అయిపోయిందనే వార్తలు ప్రసారం కావడం..ఆ విషయమై నెట్టింట చర్చ స్టార్ట్ అయింది.

అలా ఈ చర్చ కాస్తా సింగర్ సునీత వద్దకూ వెళ్లింది. దాంతో ఈ విషయమై స్పందించారు సునీత.‘‘దేవుడా.. జనాలు ఇంత క్రేజీగా ఉన్నారేంటి..నేను మామిడి కాయలతో ఫొటో దిగి పోస్ట్‌ చేస్తే వారు ఏదేదో రాసేశారు. అదంతా ఊహ మాత్రమే..దయచేసి ఇటువంటి వదంతులు ప్రచారం చేయకండి. మీకో దండం రా నాయనా’’అంటూ ఇన్‌ స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ లో గాయని సునీత పోస్ట్ చేసింది. దాంతో సింగర్ సునీత ప్రెగ్నెన్సీ వార్తలకు చెక్ పడినట్లయింది.

సింగర్ సునీత వ్యాపారవేత్త రామ్ వీరపనేని ని సెకండ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి అందరికీ విదితమే. ఈ నేపథ్యంలోనే ఆమె మరోసారి తల్లి కాబోతున్నదన్న వార్తలకు, ఆమె షేర్ చేసిన ఫొటోలో పచ్చి మామిడి కాయలు ఉండటం వలన ఇటువంటి వార్తలు రాయడానకి అవకాశం లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version