తండ్రికి తగ్గ తనయ.. సితార డిమాండ్ మామూలుగా లేదుగా..?

-

సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని ఇండస్ట్రీలో చలామణి అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు కూతురు కూడా తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటూ ఇప్పటివరకు ఏ స్టార్ కిడ్ కూడా సాధించని ఘనత సాధిస్తూ మరింత క్రేజ్ సొంతం చేసుకుంటుంది ఈ చిన్నారి ప్రస్తుతం ఈమె వయసు 11 సంవత్సరాలు కానీ ఊహించని రేంజ్ లో పాపులారిటీతో పాటు అప్పుడే సంపాదించడం కూడా మొదలు పెట్టేసింది. సితార ఘట్టమనేనిగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ అందరినీ అలరించే ఈ ఛిన్నారి రీసెంట్ గా ఒక కమర్షియల్ యాడ్ లో నటించింది.

ఇక ప్రముఖ పిఎమ్ఆర్ జువెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా సైన్ చేసి అతి చిన్న వయసులోనే క్రేజీ రికార్డు సొంతం చేసుకుంది. ఇటీవల అమెరికా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై ఈ యాడ్ ప్రదర్శించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయం తెలిసి ఆనందంతో ఉబ్బిబవుతున్నారు మహేష్ అభిమానులు. మహేష్ బాబు కూడా తన కూతురు సాధించిన ఘనతను గుర్తించి ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇండియన్ సెలబ్రిటీగా పేరు దక్కించుకొని ఇప్పుడు న్యూయార్క్ లో కూడా అందరికీ పరిచయురాలు కావడంతో సితార డిమాండ్ కూడా రోజురోజుకు పెరిగిపోతుందని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే సితార ఈ యాడ్ కోసం ఎంత పారితోషకం తీసుకుంది అనేది హాట్ టాపిక్ గా మారింది.. కొంతమంది ఈ యాడ్ కోసం కొన్ని లక్షల రూపాయలు పారితోషకం తీసుకొని ఉంటుంది అంటే మరి కొంత మంది ఈ యాడ్ కోసం తాను ఒక రూపాయి కూడా తీసుకోలేదు అంటూ చెబుతున్నారు. ఎందుకంటే మహేష్ బాబు కూడా ఈ యాడ్లో సితార ఫ్రీగా నటించడానికి ఒప్పుకున్నారట.. అందుకే సదరు సంస్థ గిఫ్ట్ కింద సితార ఘట్టమనేనికి ఒక డైమండ్ నెక్లెస్ సెట్ తో పాటు రింగ్ , బ్రేస్లెట్ ఆమెకు బహుమతిగా అందించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version