నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ దూకుడు మీదున్నాడు. దసరాతో సూపర్ హిట్ అందుకున్న నాని వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే హాయ్ నాన్న అంటూ ఓ ఫ్రెష్ స్టోరీతో సినిమాను ప్రకటించిన నాని ఇప్పుడు మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘అంటే సుందరానికి’ ఫేమ్ దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నాడు నాని. ఇందులో నాని సరసన జెంటిల్మెన్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ కోలీవుడ్ డైరెక్టర్, నటుడు కీలక పాత్రలో నటిస్తున్నాడు.
తమిళ నటుడు కమ్ దర్శకుడు ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీలో ఎస్జే సూర్య నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. ఈ పాత్ర కోసం ఆయన ఏకంగా ఎనిమిది కోట్ల రెమ్యూనరేషన్ అందుకోనున్నాడట. ఓ రోల్ కోసం ఆయన ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవటం ఇదే మొదటిసారని నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఎస్ జే సూర్య నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుండటంతో ఆ మాత్రం డిమాండ్ ఉంటుందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
Delighted to have the majestic @iam_SJSuryah on board and he's ready to give you all CHILLS 🤩🤙🏾#Nani31
Natural🌟 @NameIsNani #VivekAthreya @DVVMovies pic.twitter.com/OayBSIthGq
— DVV Entertainment (@DVVMovies) October 22, 2023