దూకుడు పెంచిన బీఆర్ఎస్.. ఢిల్లీలో రైతు భరోసా యూ టర్న్ పోస్టర్స్

-

తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. రైతు భరోసాను అస్ర్తంగా చేసుకుని బీఆర్ఎస్ ప్రచార దాడిని మొదలెట్టిన విషయం తెలిసింది. తాజాగా ఈ వార్ ఢిల్లీకి చేరింది. కాంగ్రెస్ ఎన్నికల హామీలో రైతుభరోసా ఎకరాకు రూ. 15వేలు ఇస్తామని చెప్పి..ఇప్పుడు రూ.12వేలు మాత్రమే ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించడాన్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన పోస్టర్ వార్ ఢిల్లీకి చేరింది.

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద రైతు భరోసాపై రేవంత్ సర్కార్ మోసం చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు పోస్టర్లు అంటించాయి. దీనికి సంబంధించిన వీడియోలను నెట్టింట గులాబీ వారియర్స్ వైరల్ చేస్తున్నారు. ఎకరాకు రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, 2024లో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేశారని మండిపడ్డారు. రూ.12 వేలు ఇస్తామని యూటర్న్ తీసుకుందని పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. రైతుభరోసా హామీ వైఫల్యాన్ని అస్త్రంగా చేసుకుని సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని, ఇటు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ అధిష్టానం వద్ధ రాజకీయంగా దెబ్బతీసే వ్యూహంలో భాగంగా బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version