సిగ్న‌ల్ లేదంటే సోనుసుద్ ట‌వ‌ర్ పెట్టించాడు!

-

బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో విల‌న్ పాత్ర‌ల‌తో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు సొనుసుద్‌. లాక్‌డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స కూలీల‌కు అండ‌గా నిలిచి గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు. ఎక్క‌డ క‌ష్టం వుందంటే అక్క‌డ తానున్నానంటూ ప్ర‌త్య‌క్ష్యం అవుతున్నాడు. వారికి త‌న వంతు స‌హాయం చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. సోను సేవ‌లకు మెచ్చి ఐరాస విశిష్ట పుర‌స్కారంతో సోనుసుద్‌ని గౌర‌వించింది.

ఇదిలా వుంటే సోను త‌న సేవ‌ల్ని మాత్రం ఆప‌డం లేదు. అల‌సిపోవ‌డం లేదు. ఎక్క‌డ ఎలాంటి ఆప‌ద‌, అవ‌సరం వుందంటే వెంట‌నే స్పందిస్తున్నాడు. తాజాగా ఆయ‌న చేసిన ప‌నికి ఓ గ్రామం మొత్తం ఆయ‌న‌కు ఫిదా అయిపోయింది. హ‌ర్యానాలోని మోర్నీ అనే గ్రామంలో ఓ పిల్లాడు ఆన్ లైన్ క్లాసుల కోసం చెట్టు ఎక్కాల్సి వ‌చ్చింది. ఊళ్లో సిగ్న‌ల్ స‌మ‌స్య వుండ‌టంతో ఆన్‌లైన్ క్లాసుల కోసం చెట్టు ఎక్క‌డం  అనివార్యం గా మారింది. ట్విట్ట‌ర్ ‌ద్వారా ఈ విష‌యం తెలుసుకున్న సోనుసుద్ ఏకంగా ఆ గ్ర‌మానికి ఏయిర్ టెల్‌ సెల్ ట‌వ‌ర్‌ని ఏర్పాటు చేయించాడు. ఎన్నో ద‌శాబ్దాలుగా తీర‌ని స‌మ‌స్య‌ని కేవ‌లం రోజుల్లోనే సోసు ప‌రిష్క‌రించ‌డంతో ఆ గ్రామ‌స్థులు సోనుసుద్‌కు చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version